Header Banner

ప్రభుత్వ కీలక అప్‌డేట్.. ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే! 80 కిలోమీటర్ల దూరంలో..

  Sun Mar 09, 2025 00:26        Politics

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటికి తోడుగా మరో ఏడు ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. విమానాశ్రయాలు, మౌలిక వసతులు అభివృద్ధి చేసి ఏపీని లాజిస్టిక్ హబ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్రం నుంచి సహకారం అందుతూ ఉండటంతో ఏపీలో ఐదుచోట్ల ఎయిర్‌పోర్టుల ఏర్పాటు కోసం కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది. అందులో భాగంగా శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రక్రియలో భాగంగా టెక్నో ఎకనమిక్ ఫీజబులిటీ రిపోర్ట్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌పోర్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APADCL) కన్సల్టెన్సీలను ఆహ్వానిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని ఈశాన్య ప్రాంతంలో, శ్రీకాకుళం పట్టణానికి సుమారుగా 80 కిలోమీటర్ల దూరంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రాంతం అయితే అటు శ్రీకాకుళానికి ఇటు విశాఖపట్నానికి అనుకూలంగా ఉంటుందని అంచనా. అలాగే కోల్‌కతా- చెన్నై జాతీయ రహదారితో అనుసంధానమై ఉంటుంది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు.. అక్కడే..! హామీ ఇచ్చిన విధంగానే.. పండగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

ఈ నేపథ్యంలో శ్రీకాకుళం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రక్రియలో భాగంగా టెక్నో, ఎకనమిక్ ఫీజబులిటీ రిపోర్టు తయారీ కోసం కన్సల్టెన్సీలను ఆహ్వానిస్తున్నారు. ఈ కన్సల్టెన్సీలు నివేదిక తయారు చేయటంతో పాటుగా, తాజా నిబంధనల ప్రకారం మాస్టర్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుంది. అలాగే ఎన్విరాన్‌మెంటల్, సోషల్ ఇంపాక్ట్ పైనా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలో ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు కోసం మందస, వజ్రపుకొత్తూరు మండలాల మధ్య భూమిని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు గతంలో ప్రాథమికంగా నిర్ణయించారు. ఏఏఐకు చెందిన ఐదుగురు సభ్యుల బృందం మందస మండలంలోని బిదిమి, వజ్రపుకొత్తూరు మండలంలోని అనకాపల్లి గ్రామంలో ఇటీవల పర్యటించింది. ఈ ప్రాంతంలోని భూమి ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అనువుగా ఉంటుందని నిర్ణయించింది. శ్రీకాకుళం ఎయిర్‌పోర్టు కోసం మొత్తం 1384 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా. గుర్తించిన ల్యాండ్ పార్సిల్‌లో 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. మిగతా 1100 ఎకరాల భూమిని స్థానికుల నుంచి సేకరించాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ నేతల్లో వణుకు! కూట్ర విఫలం.. వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది!

 

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూ, వారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందా? లేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలు, ఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుంది, ఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations